పోస్ట్‌లు

అక్టోబర్, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది
  శరీరం కింది భాగానికి ఎక్కువ వ్యాయామం లభించి కాళ్లు దృఢంగా తయారవుతాయి. ఈ సైక్లింగ్ వల్ల అరగంటలో 330 కేలరీలు ఖర్చవుతాయి. అందువల్ల నడకకన్నా కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది. దీని వల్ల కూర్చోవడం, లేవడం, నడవడం, నిలబడ్డం లాంటి అనేక శారీరక ప్రక్రియలు సులభమవుతాయి. అజీర్ణం లాంటి సమస్యలు దూరమవుతాయి. మనిషిలో నిరాశను తొలగించి నూతన ఉత్సాహాన్ని నింపుతుంది. స్ర్తిలలో బహిష్టుకు ముందు వచ్చే నొప్పి, ఇబ్బందులను దూరం చేస్తుంది. ఉత్తమ ఆరోగ్యం, ఆకర్షణీయమైన శరీరాకృతి ఇచ్చే ఈ హెల్త్ బైసికిల్ 30 ఏళ్లకే లావుగా తయారయి పోతున్న నేటి ఆధునిక మధ్య వయసు మహిళలకు అద్భుత వ్యాయామ సాధనం . వెన్నెముక సక్రమంగా ఉంటుంది. బాడీ షేప్ కూడా ఆకర్షణీయంగా తయారవుతుంది. నష్టాలు /కష్టాలు : మధుమేహం సమస్య ఉన్న వారికి ఈ సైక్లింగ్ నిషిద్ధం-వీరికి నడక వ్యాయామము మంచిది . ఒకే చోట సైక్లింగ్ చేయడం బోర్ కొట్టవచ్చు. శరీరం పైభాగానికి వ్యాయామం లేక పోవడం వల్ల ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. హెల్త్ బైసికిల్ ధర ఎక్కువ అయినందున దిగువ, మధ్యతరగతి వారికి భారం కావచ్చు. తెల్లవారుజామునే లేచి వాకింగ్, జాగింగ్ లాంటివి చేయలేని వారు, బిజీ రోడ్లపై న, గతుకుల రోడ్లపైన ...
చిత్రం
 
  ఉరుకుల పరుగుల జీవితంలో ఎంతో కొంత ఆందోళన, ఆదుర్దా సహజం. అయితే అవి రక్తపోటును పెంచేటంత స్థాయికి చేరుకోకుండా జాగ్రత్త పడాలి. ధ్యానం, యోగా, వ్యాయామాలతో పాటు యాంటీ యాంగ్జయిటీ ఆహారంతో కూడా ఆందోళనను అదుపులో ఉంచుకోగలిగే వీలుంది. బ్రౌన్‌ రైస్‌: మాంగనీసు, సెలీనియం, మెగ్నీషియం, బి విటమిన్లు... ఇలా నాడీ వ్యవస్థకూ, మానసిక ఆరోగ్యానికీ కీలకమైన పోషకాలు బ్రౌన్‌ రైస్‌లో ఉంటాయి. కాబట్టి తెల్ల అన్నం మానేసి, బ్రౌన్‌ రైస్‌ అలవాటు చేసుకోవాలి. ఆకుపచ్చ అరటి: నాడుల్లో సంకేతాల ప్రసారానికి, కండరాల పనితీరుకు, కణాల్లో ద్రవ పరిమాణానికీ తోడ్పడే ఖనిజలవణం పొటాషియం ఆకుపచ్చని అరటిలో ఎక్కువ. అలాగే ఈ అరటితో ఆందోళన అదుపు తప్పేలా చేసే రక్తంలోని చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరిగిపోకుండా ఉంటాయి. బాదం: బాదంలో మెదడుకు మేలు చేసే విటమిన్‌ ఇ, మెగ్నీషియం ఉంటాయి. విటమిన్‌ ఇ ఫ్రీ ర్యాడికల్‌ డ్యామేజీ నుంచి కణాల పైపొరలకు రక్షణనిస్తుంది. ఫలితంగా మెదడు ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. పెరిగే వయసుతో జ్ఞాపకశక్తి తరిగిపోకుండా ఉంటుంది. అవిసె గింజలు: వీటిలో మెదడు ఆరోగ్యానికి తోడ్పడే పోషకాలతో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, బి విటమిన్‌, మెగ్నీషి...
  జ్ఞానానంద మయం దేవం నిర్మల స్ఫటికాకృతిమ్| ఆధారాం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే ||